రాజన్న సిరిసిల్ల : ఆర్టీసీ బస్సులో(RTC bus) ఓ మహిళా సైకో(Female psycho) వీరంగం సృష్టించింది. తోటి ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్‌పై దుర్భాషలాడుతూ అసభ్యంగా(Misbehaving) ప్రవర్తించింది. వివరాల్లోకి వెళ్తే..వేములవాడ(Vemulavada) నుంచి సిద్దిపేటకు వెళ్లే బస్సులో తిప్పాపూర్ బస్టాండ్‌లో ఓ మహిళ ఎక్కింది. సదు మహిళ నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో పాటు అసభ్య ప్రవర్తనతో తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసింది. దీంతో ప్రయాణికులు అభ్యంతరం చేస్తూ కండక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
మందలించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై సైతం ఆమె తీవ్ర పదజాలంతో దూషించింది. వెంటనే ప్రయాణికులు 100కు ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న బ్లూ కోర్టు పోలీసులపై సైతం మహిళ కత్తి చూపిస్తూ హల్చల్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, వేములవాడ బస్ డిపో వద్ద బస్సు సుమారు గంటసేపు ఆగడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.