TSRTC | కండక్టర్లపై దాడి కేసులో మహిళా ప్రయాణికురాలి అరెస్ట్..!
TSRTC | హైదరాబాద్ నగర పరిధిలోని హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన వ్యవహారంలో నిందితురాలు అంబర్‌పేటకు సయ్యద్ సమీనాను ఎల్బీనగర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
TSRTC | హైదరాబాద్ నగర పరిధిలోని హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన వ్యవహారంలో నిందితురాలు అంబర్‌పేటకు సయ్యద్ సమీనాను ఎల్బీనగర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితురాలికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ కేసు విచారణను త్వరతిగతిన చేపట్టి, నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
టీఎస్ ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించినా, దాడులకు పాల్పడినా యాజమాన్యం ఏమాత్రం సహించదని సజ్జనార్ హెచ్చరించారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేశారు. పోలీస్‌శాఖ సహకారంతో నేరస్తులపై హిస్టరీ షీట్స్ తెరిచేలా సంస్థ చర్యలు తీసుకుంటుందన్నారు. 45వేల మంది టీఎస్ఆర్టీసీ సిబ్బంది ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బతీయడంతో పాటు మనోవేధనకు గురి చేసేలా ఘటనకు పాల్పడొద్దని ఆయన సూచించారు. క్షణికావేశంలో సహనం కోల్పోయి దాడులకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సజ్జనార్ సూచించారు.
#Hyderabad లోని హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఇటీవల నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన వ్యవహారంలో నిందితురాలైన అంబర్ పేటకు చెందిన సయ్యద్ సమీనాను రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితురాలికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14… pic.twitter.com/6vx3EXv51A
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) February 4, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

