చర్ల, ఆగస్టు 21 : పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఓ మహిళా మావోయిస్టును హతమార్చారు. ఆమె మృతదేహాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం సమీపంలో బుధవారం ఉదయం వదిలి వెళ్లారు. హైదరాబాద్‌లోని బాలాజీనగర్ సమీపంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన బంటి రాధ అలియాస్ నీల్సో (34) కొన్నేండ్ల క్రితం మావోయిస్టు పార్టీలో చేరి చురుకుగా పనిచేస్తుండటంతో పార్టీ ఆమెకు పలు కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో ఇన్ఫార్మర్గా మారి తమ సమాచారం పోలీసులకు చేరవేస్తుందనే నెపంతో ఆమెను మావోయిస్టులు హతమార్చారు. మృతదేహాన్ని తీసుకొచ్చి చెన్నాపురం సమీపంలో వదిలి వెళ్లారు. అయితే నీల్సో మృతదేహం వద్ద ఆంధ్రా-ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ పేరుతో లేఖ ఉంచారు. విప్లవ ద్రోహి నీల్సో అని, అందుకే ఆమెను హతమార్చామని ఆ లేఖలో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న చర్ల సీఐ రాజువర్మ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భద్రాచలం ఏరియా దవాఖానకు తరలించారు.
హడావుడిగా హెచ్ఎంల పదోన్నతులు షెడ్యూల్ ప్రకటించాలంటున్న టీచర్లు
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖలో హడావుడిగా పదోన్నతులు కల్పించడంపై టీచర్లు అ భ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. రెండు రో జుల్లోనే పదోన్నతులిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది సరికాదని, పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ప్రకటించి పదోన్నతులు క ల్పించాలని కోరుతున్నారు. 2023 సె ప్టెంబర్‌లో మల్టీజోన్-1లో, జూన్, జూలై మాసాల్లో మల్టీజోన్-2లో జిల్లా పరిషత్ టీచర్లకు హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించారు. అయినా రెండు మల్టీజోన్లలో పలుఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో స్కూల్ అసిస్టెంట్ నుం చి హెచ్ఎం పదోన్నతులు చేపట్టేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తున్నది. వరంగల్ మల్టీజోన్‌లో 150 మందికి, హైదరాబాద్ మల్టీజోన్ పరిధిలో 100 మంది వరకు పదోన్నతులొచ్చే అవకాశముంది. రాత్రికి రాత్రి హడావిడిగా ప్రక్రియను చేపట్టడంపై టీచర్లు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడం పెద్ద ప్రహసనమని, కాబట్టి తగిన సమయమివ్వాలని కోరుతున్నారు.