వరంగల్ : వరంగల్ పట్టణంలో ఓ మహిళా కానిస్టేబుల్(women constable) ఆత్మహత్య(suicide)కు పాల్పడింది. మహబూబాబాద్‌లో రైటర్‌గా పనిచేస్తున్న మౌనిక వరంగల్(warangal)లోని తన నివాసంలో రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకుందని, ఆమె మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మౌనిక మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.