హైదరాబాద్, జనవరి 9(నమస్తే తెలంగాణ) : బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చారించారు. బీసీ విద్యార్థి సంఘం రూపొందించిన క్యాలెండర్ ఆవిషరించారు.
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో నమోదైన గుర్తింపు లేని రాజకీయ పార్టీలు (ఆర్‌యూపీపీ) ఆర్థిక నివేదికలను నిర్ణీత గడువులోగా సమర్పించకపోతే చట్ట ప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. ప్రతి ఆర్థిక సంవత్సరానికీ సంబంధించిన విరాళాల నివేదికను అక్టోబర్ 31వ తేదీలోపు, ఆడిట్ చేసిన వార్షిక ఖాతాలను ఆదాయ పన్ను రిటర్న్ గడువు ముగిసిన తేదీ నుంచి నెలలోపు ఇవ్వాలని శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు.
శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత 75 రోజుల్లో, లోక్‌సభ ఎన్నికల తర్వాత 90 రోజుల్లోగా ఎన్నికల ఖర్చుల నివేదికలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్-29సీ ప్రకారం ఇవి ఆదాయపన్ను మినహాయింపులకు అర్హత పొందేందుకు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.