హైదరాబాద్, మే 24 (నమస్తే తె లంగాణ) : రాష్ట్రంలో విద్యారంగం అస్తవ్యస్తంగా మారిందని, సీఎం రేవంత్రెడ్డి విద్యాశాఖను తానే నిర్వహిస్తున్నా ఫీజుల దోపిడీని మాత్రం అరికట్టడం లే దని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అ ధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్లోని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన స మావేశంలో వారు మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి 26 నెలలైనా విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని, విద్యారంగ సమస్య ల పరిషారం కోసం సీఎం ప్రజా ద ర్బార్ ని ర్వహించడం లేదని తెలిపారు.
విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, ప్రతి వి ద్యార్థినికీ ఎలక్ట్రిక్ సూటీ, విద్యార్థులు ఉండే ఇండ్లకు ఉచిత ఇంటర్నెట్, విద్యా జ్యోతి పథకం హామీలను ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించా రు. అధికారంలో వస్తే ఫీజు బకాయిలు ఒకేసారి విడుదల చేస్తామన్న రేవంత్.. నేడు బకాయిలు విడుదల చేయకుండా వి ద్యార్థుల జీవితాలతో, బడ్జెట్ కళాశాల టీచింగ్ స్టాఫ్ కుటుంబాల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. ప్రభుత్వ పాఠశాల కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్టీచిం గ్ పోస్టులను భర్తీ చేయాలని మణికంఠరెడ్డి, పుట్టా లక్ష్మణ్ డిమాండ్ చేశారు.