హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలు ఫీజు, ైస్టెఫండ్ వివరాలను బహిర్గతపర్చాలని జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) సోమవారం నోటీసులు జారీచేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
మెడికల్ కాలేజీలు ఫీజు, ైస్టెపెండ్కు సంబంధించి పూర్తి వివరాలను గూగుల్ ఫామ్స్ ద్వారా ఏడు రోజుల్లోగా పంపాలని కోరింది. ఫీజు, ఇంటర్న్‌లకు ఇచ్చే ైస్టెఫండ్ వివరాలను తమ అఫిషియల్ వెబ్సైట్లలో పొందుపర్చాలని మెడికల్ కాలేజీలను జాతీయ వైద్య మండలి ఆదేశించింది.