Ramoji Rao | హైదరాబాద్ : ఈనాడు అధినేత రామోజీ రావు మృతిపట్ల ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం సంతాపం ప్రకటించారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పత్రిక, టీవీ, సినిమా రంగాల్లో రామోజీరావు సాధించిన విజయాలు తెలుగు జాతికి గర్వంగా నిలుస్తాయని అనిల్ పేర్కొన్నారు. నిర్మాతగా టాలీవుడ్లో ఎన్నో మరపురాని సినిమాలను నిర్మించారని గుర్తు చేశారు. తెలుగు, బెంగాలీ, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. రామోజీరావు భారతీయ చలనచిత్ర రంగాన్ని నూతన శిఖరాలకు చేర్చారని కొనియాడారు. ఉషాకిరణ్ మూవీస్ ద్వారా వివిధ భాషల్లో 87 సినిమాలు నిర్మించారు. హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ సిటీ నిర్మించి, ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ ద్వారా ఎంతోమంది నటులు పరిచయమై ఎంతోమంది నటులు, అగ్రశ్రేణి తారలుగా ఎదిగారని అనిల్ పేర్కొన్నారు.