భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు చెందిన హమాలీలు పోరుబాటపట్టారు. దేశవ్యాప్తంగా ఎఫ్‌సీఐ గిడ్డంగుల్లోని మేనేజర్ కార్యాలయాల ఎదుట శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ధర్నా చేశారు. సనత్‌నగర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ఎఫ్‌సీఐ శ్రామిక సంఘ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఖలీమ్ అహ్మద్ మాట్లాడుతూ.. గిడ్డంగుల్లో ఖాళీగా ఉన్న 35 వేల పోస్టులను కేంద్రం భర్తీ చేయడంలేదని, డిపోలను మూసివేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న హమాలీ పోస్టులను భర్తీ చేయడంతోపాటు కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, దిలీప్‌కుమార్ దాస్, డీ వెంకటయ్య పాల్గొన్నారు. – అమీర్‌పేట్