కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 3 : ఆడపిల్లలు పుట్టారని నాలుగేండ్ల వయస్సున్న ఆ కవలలను ఓ తండ్రి బావిలో పడేసి హతమార్చాడు. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్లో ఈ దారుణం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీనగర్కు చెంది న కచ్చు శ్రీశైలం, మౌనిక దంపతులకు కవలలు గీత అన్విత(4), గీత అనిషి (4) ఉన్నారు. వీరు పుట్టినప్పటి నుంచి ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చావని శ్రీశైలం భార్యతో తరుచూ గొడవ పడుతుండేవాడు. గ్రామ పెద్దలు, బంధువు లు సర్దిచెప్పినా వినలేదు. భార్యాపిల్ల లు వద్దని అనేకసార్లు గొడవలకు దిగా డు. ఇంటి పక్కన ఉండే తమ్ముడు, మరదలు శుక్రవారం పెద్దపూర్ జాతరకు వెళ్లడంతో ఇంట్లో భ్యారతో గొడవపడ్డ శ్రీశైలం ఇద్దరు పిల్లలను తీసుకుని పొలానికి వెళ్లాడు. అక్కడే వారికి గడ్డిమందు తాగించి, వ్యవసాయ బావి లో పడేశాడు. తిరిగి ఒంటరిగా రావడంతో స్థానికులు అతడిని ప్రశ్నించడంతో నిజం చెప్పాడు. దీంతో గ్రామస్థులు దేహశుద్ధిచేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బావిలో వెతుకగా ఇద్దరి మృతదేహాలు లభించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.