హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఏపీలోని చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ వద్ద శుక్రవారం బస్సు, రెండు లారీలను ఢీకొట్టగా.. బస్సులో ఉన్న 8 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 40 మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించి కేసు విచారణ జరుపుతున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ): శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానం అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. శ్రీశైల క్షేత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ప్రాచీన కట్టడాలు తదితర అంశాల ఆధారంగా లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దకించుకున్నది. ఆ సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ విభాగపు సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఇలియాజర్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఈవో పెద్దిరాజుకు ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు.