Road Accident | చౌటుప్పల్, ఫిబ్రవరి 19 : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. అత్తగారింటికి కుటుంబంతో వెళ్తున్న వ్యక్తి కారుపైకి అతివేగంగా మరో కారు దూసుకొచ్చింది. డివైడర్ ఢీకొని అవతలి రోడ్డుపై ఉన్న కారును ఢీకొట్టడంతో తండ్రి, ఐదు నెలల కుమారుడు అక్కడికక్కడే మృతిచెందారు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని పటాన్చెరుకు చెందిన సాయికుమార్(33), తన భార్య సింధూజ, ఐదు నెలల కుమారుడు వీరాన్స్, తల్లిదండ్రులతో కలిసి బుధవారం సూర్యాపేటలోని కారులో బయల్దేరారు.
సాయంత్రం 6 గంటల సమయంలో చౌటుప్పల్ మండల పరిధిలోని దండు మల్కాపురం వద్దకు చేరుకోగా.. విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తున్న కారు అతివేగంగా డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపు రోడ్డులో ఉన్న సాయికుమార్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయికుమార్, వీరాన్స్ అక్కడికక్కడే మృతిచెందాడు. సాయికుమార్ భార్య, తల్లిదండ్రులకు తీవ్రగాయాలయ్యాయి. ఢీకొట్టిన కారులో ఉన్న ఇద్దరు వెంటనే ప్రైవేట్ వాహనంలో హైదరాబాద్లోని దవాఖానకు వెళ్లారు. సాయికుమార్ భార్య, తల్లిదండ్రులను చౌటుప్పల్ పోలీసులు హైదరాబాద్లోని కామినేని దవాఖానకు తరలించి, కేసు దర్యాఫ్తు చేస్తున్నారు.