కథలాపూర్, జూన్ 6 : పంటల అవశేషాలు కాల్చితే చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ అధికారి యోగితా తెలిపారు. శనివారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం రాజారాంతండాలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంటల అవశేషాలు కాల్చితే భూసారానికి ముప్పు ఉంటుందని ఇది వరకే రైతులకు అవగాహన కల్పించామని పేర్కొన్నారు.
ఈ క్రమంలో వరి కొయ్యకాలు కాల్చిన విషయమై సర్పంచ్ తిరుపతినాయక్, కార్యదర్శి నరేశ్ దృష్టికి ఆమె తీసుకెళ్లారు. దీంతో భూక్యా నంద్యానాయక్, బానోత్ రాజు, లకావత్ పంతులు, లకావత్ రాములు, లకావత్ భక్ష్యానాయక్కు రూ.5వేల చొప్పున జరిమానా విధించారు.