Nadergul Lands | నాదర్గుల్ భూముల్లో రైతుల వంటావార్పు..రోజంతా కంచెల ముందే బైఠాయించి నిరసన తెల్పిన రైతులు
ప్రాణం పోయినా తమ భూములు వదులుకునేది లేదంటూ నాదర్గుల్ రైతులు తేల్చిచెప్తున్నారు. ప్రైవేట్ కంపెనీకి వత్తాసు పలుకుతూ మంత్రి మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
- పొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీస్, ప్రైవేట్ సేన
- రోజంతా కంచెల ముందే బైఠాయించి నిరసన తెల్పిన రైతులు
- ప్రాణం పోయినా పోరాటం ఆపం
- మా భూములు మాకే కావాలి
- నాదర్గుల్లో రైతుల పోరుబాట
- రైతులకు సంఘీభావంగా రాకుండా అడ్డుకున్నరు: మాజీ ఎంపీ అజీజ్‌పాషా
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ)/బడంగ్పేట్: ప్రాణం పోయినా తమ భూములు వదులుకునేది లేదంటూ నాదర్గుల్ రైతులు తేల్చిచెప్తున్నారు. ప్రైవేట్ కంపెనీకి వత్తాసు పలుకుతూ మంత్రి మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏడు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమను పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు, ప్రైవేట్ సైన్యం అడ్డుకోవడంతో కంచె ఎదుట ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా గురువారం వంటావార్పు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 613లో ఉన్న 373.22 ఎకరాల భూమిని రైతులకే దక్కేలా ప్రభుత్వం సహకరించాలని వేడుకుంటున్నారు. ఇందిరాగాంధీ నాడు పేద రైతులు వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ఆ భూములను ప్రై వేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేయడం పై ఆందోళన చెందుతున్నారు. ఉదయం గుడికి పోదామన్నా గేటు తీయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి దగ్గర చిన్న పిల్లలను వదిలేసి పొలం దగ్గర ఉండాల్సి వస్తున్నదని వాపోయారు.
పోలీసులా? ప్రైవేట్ ఏజెంట్లా?!
నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూ ములకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ప్రైవే ట్ కంపెనీల కబ్జాకు వత్తాసు పలుకుతూ రైతులను అందులోకి పోనీయకుండా అడ్డుకోవ డంపై నాదర్గుల్ రైతులు మండిపడుతున్నా రు. ఇటీవల చోటుచేసుకున్న ఘటనను రైతు ఒకరు ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నా రు. రైతుల పోరాటానికి సంఘీభావంగా రాజ్యసభ మాజీ సభ్యుడు, సీపీఐ నేత అజీజ్‌పాషా ఇటీవల అక్కడికి వచ్చారు. ఒక పోలీసు అధికారి ఆయన వాహనం దగ్గరకు వచ్చి సంభాషించిన వివరాలను రైతులు వెల్లడించారు. ‘ఈ రైతులను నమ్మొద్దు సార్… ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్?’ అని పోలీ సు అధికారి అజీజ్పాషాను ప్రశ్నించారు. స్పందించిన అజీజ్‌పాషా, పక్కన ఉన్న రైతు లు తమ భూముల కోసం పోరాడుతుంటే ఇలా మాట్లాడటం సమంజసం కాదని మందలించినట్టు చెప్పారు. ప్రైవేట్ కంపెనీలు భయపెడితే రైతులు ఏం చేస్తారు? అని ఎదురు ప్రశ్నించినట్టు తెలిపారు. ‘రైతులకు మద్దతు తెలిపేందుకు ఇక్కడికి వచ్చిన. రైతుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తా. అవసరమైతే చలో అసెంబ్లీ కూడా నిర్వహిస్తా’ అని అజీజ్‌పాషా అనడంతో పోలీసు అధికారి వ్యూహం బెడిసికొట్టినట్టయ్యింది. కాగా అజీజ్‌పాషా అక్కడ మీడియాతో మాట్లాడుతూ… రైతులకు సంఘీభావంగా ఇక్కడికి వస్తుంటే తనను అడ్డుకునేందుకు చాలా మంది ప్రయత్నించారని తెలిపారు. దీంతో నాదర్గుల్ భూములపై రైతుల పోరాటాన్ని అడ్డుకునేందుకు పెద్ద శక్తులే పనిచేస్తున్నట్టు అర్థమవుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

