ఆదిలాబాద్ : జొన్న పంటను కొనుగోలు చేయాలంటూ ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. పంట కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జొన్నలను కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి నష్టపోతున్నామంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు ప్రారంభించి రైతుల పండించిన మొత్తం పంటను కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు మార్కెట్ యార్డ్‌కు రైతులు జొన్నలు భారీగా తీసుకురావడంతో మార్కెట్ ముందు వాహనాల రద్దీ నెలకొంది. నాలుగు రోజులుగా పంట కొనుగోలు నిలిచిపోవడంతో గురువారం నుంచి జొన్నల సేకరణ ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు ఒకరోజు ముందుగానే పంటను మార్కెట్ కు తీసుకువచ్చారు. అధికారులు సరైన వసతులు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.