నమస్తే నెట్వర్క్, ఆగస్టు 8 : యూరియా కోసం సొసైటీల వద్ద రైతులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పీఏసీఎస్ గోదాం వద్ద అన్నదాతలు శుక్రవారం ఉదయం నుంచి నిరీక్షించగా రాత్రి వేళ పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో ఏ ఎరువుల దుకాణం వద్ద చూసినా రైతుల క్యూలే కనిపిస్తున్నాయి. యూరియా కొరత కారణంగా రైతులు క్యూలో చెప్పులు పెట్టి గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి, ధరూర్, అయిజతోపాటు పలు ప్రాంతాల నుంచి డీలర్లు యూరియాను తరలించి ఇక్కడ కొరత సృష్టిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు ఎగబడ్డారు.