రాజాపేట : కాళేశ్వరం ప్యాకేజీ-15 ద్వారా చెరువులు నింపి పొలాలకు నీళ్లివ్వాలని రైతులు నిరసన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల రైతులు కొద్దిరోజులుగా సాగునీటి కోసం ఆందోళనలు చేస్తున్నారు.
అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో గురువారం మండల కేంద్రంలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు.