మరికల్, నవంబర్ 19 : సరిపడా గన్నీ బ్యాగులు అందించాలని నారాయణపేట జిల్లా మరికల్ మండలం పూసల్పాడు గ్రామానికి చెందిన రైతులు డిమాండ్ చేశారు. బుధవారం పూసల్పాడు రైతు వేదికకు 20 వేల గన్నీ బ్యాగులు రావడంతో రైతులు ఒక్కసారిగా అక్కడికి చేరుకొన్నా రు. గ్రామానికి 70 వేల గన్నీ బ్యాగులు అ వసరం కాగా మొత్తంగా 37వేలు ఇవ్వడం ఏంటని వ్యవసాయాధికారి రహమాన్, తహసీల్దార్ రామ్కోటితో రైతులు వాగ్వాదానికి దిగారు. విడుతల వారీగా రైతులందరికీ గన్నీ బ్యాగు లు అందజేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.