యాదాద్రి భువనగిరి : రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట రైతులు నిరసన తెలుపుతున్నారు. రోజులో పది సార్లు కరెంట్ వస్తూ పోతూ.. లో-వోల్టేజ్‌తో తమ మోటర్లు అన్ని కాలిపోతున్నాయని ఆలేరు మండలం కొలనుపాక గ్రామ రైతులు లేరు- సిద్దిపేట రహదారి వద్దగల విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట రోడ్డు మీద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలలని డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారులు ఎవ్వరూ కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.