పెద్దకొడప్గల్, జూన్ 7: విద్యుత్తు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్చేస్తూ కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ సబ్స్టేషన్ కార్యాలయం ఎదుట అల్లాపూర్ రైతులు శనివారం బైఠాయించారు. వారంలో రెండ్రోజులు కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నామని, రాత్రయితే నరకం చూస్తున్నామని వాపోయారు.
నెల రోజులుగా జేఎల్ఎం లేకపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయని, ఏ అధికారిని అడిగినా స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పొలాల్లో విద్యుత్తు వైర్ల సమస్యలు వస్తే ఎల్సీ ఇవ్వమని అడిగితే ఇవ్వడంలేదని, లైన్మన్ చెబితేనే ఇస్తామని చెబుతున్నారని వాపోయారు. ఇన్చార్జి ఏఈ పవన్ వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.