భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం కనుముక్కలలో గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. తడిసిన ధాన్యం బస్తాలతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన రైతులు (Farmers) ధర్నాకు దిగారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటు వేస్తామని పోలింగ్ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. జై జవాన్.. జై కిసాన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో పోలింగ్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రైతులకు నచ్చజెప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
కాగా, ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయమాదారంలో ప్రజలు ఓట్లను బహిష్కరించారు. ఎన్ఎస్పీ కాలువపై వంతెన నిర్మించలేదంటూ పోలింగ్‌కు దూరంగా ఉన్నారు.