మక్తల్, జూలై 22 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులు పరిహారం కోసం ప్లకార్డులతో నిరసన తెలిపారు. మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి, ఎర్రగాన్పల్లి, కాచ్వార్ గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల వద్ద రైతు కుటుంబాలు ప్లకార్డులు ప్రదర్శించారు.
కొడంగల్ నియోజకవర్గానికి సాగునీరు తరలించేందుకు మక్తల్ మండలంలోని పలు గ్రామాల రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.కోట్ల విలువ చేసే భూములకు సర్కారు ఎకరాకు కేవలం రూ.14 లక్షలు ఇస్తామనడం సరికాదని, మార్కెట్ వాల్యూ ప్రకారం ధర చెల్లించాకే పనులు చేపట్టాలని, లేదంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు.