వేములపల్లి, ఏప్రిల్ 4 : ధాన్యం కొనుగోలు చేయకుండా మిలర్లు ఇబ్బందులు పెడుతుండడంతో విసుగెత్తిన రైతులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా శెట్టిపాలెం రాస్తారోకో చేశారు. వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలో 18 మిల్లులు ఉన్నాయి. మిల్లు గేట్లు మూసి పెడుతుండడంతో ధాన్యం లోడ్లతో వచ్చిన రైతులు ఎక్కడ అమ్ముకోవాలో తెలియక అవస్థ పడుతున్నారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా అనేక ట్రాక్టర్లు మిల్లుల ఎదుట బారులు తీరాయి. అధికారులు పత్తా లేరు. మిలర్లను అడిగితే నిర్లక్ష్యంగా బదులిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. దీంతో సాయంత్రం ఆరు గంటల సమయంలో మహాతేజ మిల్లు ఎదుట అద్దంకి-నార్కెట్పల్లి హైవేపై ధాన్యం ట్రాక్టర్లతో రైతులు రాస్తారోకోకు దిగారు. ధాన్యం కొనుగోలు చేసేవరకూ ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు. హామీనిచ్చి ఆందోళన విరమింపచేశారు.