మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పాలేరు (బయన్న) వాగులోకి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని బుధవారం కర్కాల గ్రామ రైతులు ఎండిన వాగులో ఆందోళన చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండే ఎండల్లోనూ ఈ వాగు నీళ్లతో కళకళలాడేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎండిపోవడంతో ఆయకట్టు బీడుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వనీరెడ్డి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.