తాడూరు, ఫిబ్రవరి 1 : కల్వకుర్తి-నంద్యాల జాతీయ రహదారికి భూములిచ్చేది లేదంటూ ఇద్దరు రైతులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండల కేం ద్రం సమీపంలో శనివారం చోటుచేసుకున్నది. కల్వకుర్తి-నంద్యాల హైవే-167కే కోసం తాడూరుకు సమీపంలో రెండున్నర కిలోమీటర్లు బైపాస్ నిర్మాణానికి అధికారులు భూసేకరణ చేపట్టారు. ఇం దులో కొందరు రైతులు తమ భూములు జాతీయ రహదారికి ఇవ్వబోమంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. శనివారం అధికారులు భారీ బందోబస్తు మధ్య సర్వే చేపట్టారు. దీంతో మనస్తాపానికి గురైన రైతు శేఖర్ పురుగుల మందు తా గగా.. మరో రైతు కురుమూర్తి ఒంటిపై పె ట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకొని దవాఖానకు తరలించారు.