ఆదిలాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ( Loan waiver) చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు ముందు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని దేవుడి మీద ఒట్టేసి మరీ చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కొర్రీలు విధించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటూ రైతులు నిరసనలు తెలుపుతున్నారు.
శుక్రవారం ఆదిలాబాద్(Adilabad)జిల్లా తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన దాదాపు100 మంది రైతులు తమ గ్రామం నుంచి మండల కేంద్రమైన తాంసి వరకు పాదయాత్ర(Farmers march) నిర్వహించి నిరసన తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని రైతులకు రుణమాఫీ వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తింప చేయకుండా అన్యాయం చేస్తుందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.