సర్కారీ ఎర్రజెండాలపై రైతన్న కన్నెర్ర
అప్పు చెల్లించలేదని రైతు భూమిలో ఎర్రజెండాలు పాతిన సర్కారు తీరుపై రైతాంగం కన్నెర్ర చేసింది. ప్రభుత్వంతోపాటు సహకార బ్యాంకు వైఖరిని నిరసిస్తూ శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు.
- రుణమాఫీ చేసి ఆదుకోవాలని డిమాండ్
- సహకార బ్యాంకు తీరును నిరసిస్తూ ధర్నా
- మాజీ ఎమ్మెల్యే జాజాల సంఘీభావం
లింగంపేట, జూన్ 14: అప్పు చెల్లించలేదని రైతు భూమిలో ఎర్రజెండాలు పాతిన సర్కారు తీరుపై రైతాంగం కన్నెర్ర చేసింది. ప్రభుత్వంతోపాటు సహకార బ్యాంకు వైఖరిని నిరసిస్తూ శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. రుణం చెల్లించలేదనే కారణంతో కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పోల్కంపేట్ గ్రామానికి చెందిన రైతు రాజశేఖర్‌రెడ్డి భూమిలో సహకార బ్యాంకు సిబ్బంది ఎర్రజెండాలు పాతిన సంగతి తెలిసిందే. దీన్ని నిరసిస్తూ రైతులు లింగంపేట సహకార బ్యాంకు ఎదుట శుక్రవారం ధర్నాకు దిగారు. రైతుల ఆందోళనకు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ చేయకుండా, అప్పులు చెల్లించడమనం దారుణమని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు రైతుల పక్షాన నిలవాల్సిందిపోయి వారిని ఇబ్బందులుకు గురిచేయడం సరికాదని అన్నారు. బ్యాంకు అధికారులు రైతుల పంట పొలాల్లోకి వెళ్లి ఎర్ర జెండాలు పాతి భయభ్రాంతులకు గురిచేయడమేమిటని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయాన్ని పండగలా మార్చిన విషయాన్ని గుర్తుచేశారు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పటికీ మాఫీ చేయకుండా రైతులను మోసం చేస్తున్నదని అన్నారు. రుణ రికవరీ కోసం రైతు పొలాల్లో ఎర్ర జెండాలు పాతడం చరిత్రలో ఇదే మొదటిసారి అని మండిపడ్డారు. రుణాలు తీసుకున్న వారి పొలాల్లో ఎర్ర జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రైతుల పరువు తీయడం సరికాదని అన్నారు. రైతు భూమిలో బ్యాంకు అధికారులు పాతిన ఎర్ర జెండాలను తొలగించాలని, రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

