రాష్ట్రంలో రైతు రుణమాఫీని గురువారం నుంచి పునఃప్రారంభించడాన్ని హర్షిస్తూ బుధవారం రాత్రి జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని కొల్వాయి గ్రామంలో బీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ‘సీఎం కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు బీర్పూర్ మండల రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
– సారంగాపూర్

Farmers
రైతుల కష్టం తెలిసిన సీఎం
రైతుల కష్టం తెలిసిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ సారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తాండు. గవర్నమెంట్‌కు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎవుసం బాగుండాలని రైతుల అప్పులు తీరుస్తాండు. ఇంతకు ముందు చిన్న మొత్తంలో ఉన్న రుణాలను మాఫీ చేసి లక్ష రూపాయల రుణాలను కట్టాలంటడని భయపడ్డాం. సొసైటీ అప్పు తీర్చడానికి కొత్త అప్పు చేయాల్సి వస్తదనకున్నం. రైతుల బాధ తెలిసిన సీఎం మనకు ఉన్నడు కాబట్టే రైతులు ధైర్యంగా ఎవుసం చేస్తున్నారు. పంటకు పెట్టుబడి ఇచ్చి, ఉచిత కరెంట్ ఇచ్చి, పంటలకు తగిన ధర పెట్టి కొంటాండు. ఇలా ఎవుసం చేయమనే ముఖ్యమంత్రికి రైతులు ఎల్లకాలం రుణపడి ఉంటారు.
– మంగ కోమల, చెన్నారావుపేట, వరంగల్ జిల్లా
మాట నిలబెట్టుకొని కేసీఆర్ అండగా ఉన్నరు
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నరు. రుణమాఫీ అమలుచేస్తున్నందుకు రైతులమంతా కేసీఆర్‌కు రుణపడి ఉంటం. ఆర్థిక వ్యవస్థ బాగా లేకున్నా వ్యవసాయరంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మాకు బాగా ఉపయోగపడుతున్నాయి. నిరంతర ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడంతో పాటు రైతుబీమా, రైతుబంధు పథకాలను ఇవ్వడం వల్ల మేము సంతోషంగా వ్యవసాయం చేయగల్గుతున్నం.
– మంతుర్తి కొమురయ్య, దామెర, ఎల్కతుర్తి మండలం, హనుమకొండ