పంట నీటి ట్యాంకర్లకు ఫైన్
వాడుముఖం పట్టిన పంటలను కాపాడుకునేందుకు రైతులు మురుగునీటిని తరలిస్తున్నారు. నెల రోజులుగా 20 మందికిపైగా రైతులు ట్యాంకర్లను అద్దెకు తీసుకొని జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ సమీపంలోని పెద్దవాగు నుంచి మురుగు నీటిని తీసుకెళ్తున్నారు. తాము ఆర్టీఏ అధికారులం అంటూ పరిచయం చేసుకున్న వారు మురుగు నీటిని తరలిస్తున్న ట్యాంకర్లను నిలిపివేశారు. అనుమతి లేకుండా నీటిని తరలిస్తే రూ.1.50 లక్షల జరిమానా విధిస్తామని రైతులను హెచ్చరించారు.
- ఎండుతున్న పైరును కాపాడేందుకు ట్యాంకర్లతో నీళ్లు పడుతున్న దుస్థితి
- ఒక్కో రైతుకు రూ.5 వేల జరిమానా
- కాళ్లు మొక్కుతామని వేడుకుంటున్నా కనికరించని ఆర్టీఏ సిబ్బంది
- నీటి ట్యాంకర్లకు అనుమతి లేదని రైతులకు తెగేసి చెప్తున్న అధికారులు
అయిజ, నవంబర్ 10 : వాడుముఖం పట్టిన పంటలను కాపాడుకునేందుకు రైతులు మురుగునీటిని తరలిస్తున్నారు. నెల రోజులుగా 20 మందికిపైగా రైతులు ట్యాంకర్లను అద్దెకు తీసుకొని జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ సమీపంలోని పెద్దవాగు నుంచి మురుగు నీటిని తీసుకెళ్తున్నారు. తాము ఆర్టీఏ అధికారులం అంటూ పరిచయం చేసుకున్న వారు మురుగు నీటిని తరలిస్తున్న ట్యాంకర్లను నిలిపివేశారు. అనుమతి లేకుండా నీటిని తరలిస్తే రూ.1.50 లక్షల జరిమానా విధిస్తామని రైతులను హెచ్చరించారు.
ఇప్పటికే పంటలను కాపాడుకునేందుకు రూ.లక్షకుపైగా కిరాయిలు భరించి ట్యాంకర్లలో నీటిని తరలిస్తున్నామని, జరిమానా విధిస్తే తాము ఎక్కడి నుంచి పైసలు తెచ్చి కట్టాలని రైతులు ఆవేదన చెందారు. తాము తీవ్రంగా నష్టపోతామని.. కాళ్లు మొక్కుతాం.. తమను విడిచిపెట్టాలని వేడుకున్నారు. అయినా కనికరించని అధికారులు ఒక్కో రైతు నుంచి రూ.5 వేల చొప్పున.. ఇద్దరి నుంచి రూ.10 వేలు వసూలు చేశారని రైతులు పేర్కొన్నారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చేతికొచ్చిన పంటలు ఎండిపోకుండా మురుగు నీరు అందించి బతికించుకుంటున్న తరుణంలో రైతులకు మేలు చేయాల్సిన అధికారులు వసూళ్లకు పాల్పడటంపై ప్రజలు మండిపడుతున్నారు. వసూళ్లకు పాల్పడిన ఆర్టీఏ అధికారులు, సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై డీటీవో రాధికను ఫోన్లో వివరణ కోరగా.. తమ శాఖ అధికారులు ఎవరూ రైతుల వద్ద జరిమానా వసూలు చేయలేదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

