కేంద్రాల్లోనే వడ్ల కుప్పలు!
కాంగ్రెస్ పాలనలో ఎన్నో కష్టాలకోర్చి పంట పండించిన రైతును ప్రభుత్వం రోడ్ల మీద వదిలేసింది. పంటను కొనకుండా ముఖం చాటేస్తున్నది. ధాన్యం కొనుగోళ్లపై రేవంత్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంతో అన్నదాతలంతా వడ్ల కుప్పల వద్ద రోజుల తరబడి రోడ్లపైనే నిరీక్షించాల్సి వస్తున్నది. ఎల్ నినో పేరుతో వానకాలంలో ప్రభుత్వం అడుగడుగునా భయాలు సృష్టించింది. ఆరుతడి పంటలు సాగు చేయాలంటూ పూటకో హెచ్చరికలు జారీ చేస్తూ ఆగం పట్టించింది.
- కొనుగోళ్లపై ముఖం చాటేసిన సర్కార్
- ధాన్యం సేకరణ ప్రక్రియను అక్టోబర్ 1న ప్రారంభించినట్టుగా ప్రభుత్వం గొప్పలు
- ఎక్కడా ఒక్క వడ్ల గింజనూ కొనని వైనం
- ప్రైవేట్ వ్యాపారులకే వదిలేసిన ప్రభుత్వం
- రోడ్లపై రాశులు పోసి రైతుల పడిగాపులు
- ధర తగ్గించి దోచుకుంటున్న వ్యాపారులు
నిజామాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పాలనలో ఎన్నో కష్టాలకోర్చి పంట పండించిన రైతును ప్రభుత్వం రోడ్ల మీద వదిలేసింది. పంటను కొనకుండా ముఖం చాటేస్తున్నది. ధాన్యం కొనుగోళ్లపై రేవంత్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంతో అన్నదాతలంతా వడ్ల కుప్పల వద్ద రోజుల తరబడి రోడ్లపైనే నిరీక్షించాల్సి వస్తున్నది. ఎల్ నినో పేరుతో వానకాలంలో ప్రభుత్వం అడుగడుగునా భయాలు సృష్టించింది. ఆరుతడి పంటలు సాగు చేయాలంటూ పూటకో హెచ్చరికలు జారీ చేస్తూ ఆగం పట్టించింది.
కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం వల్ల రైతులకు కరెంట్ కోతలు తప్పలేదు. చేతికొచ్చిన పంట ఎండి పోయింది. అష్టకష్టాలు పడి పండించిన పంటకైనా మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ వస్తుందని రైతులు ఇప్పుడు భావిస్తుండగా అండగా నిలువాల్సిన ప్రభుత్వం పత్తా లేకుండా పోయింది. వానకాలంలో ధాన్యం సేకరణ ప్రక్రియను అక్టోబర్ 1న ప్రారంభించినట్టుగా ప్రభుత్వం గొప్పలు చెప్పుకొన్నది. కానీ ఎక్కడా ఒక్క వడ్ల గింజను కూడా సేకరించలేదు. ప్రైవేట్ వ్యాపారులకే వదిలేసి చేతులెత్తేసింది. బహిరంగ మార్కెట్లో పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రైవేట్ కొనుగోళ్లు మందగించడంతో పాటు రూ.2,800 దిగువకే బేరాలు ఆడుతున్నారు. రైతులంతా కొనుగోలు కేంద్రాల వైపు ఎదురు చూస్తుండగా పట్టించుకునే నాథుడు కూడా లేకుండా పోయారు.
రైతుకు ఊరట దక్కేనా?
ప్రస్తుత వానకాలానికి కేంద్రం సాధారణ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,441, గ్రేడ్ ఏ రకానికి రూ.2,461 కనీస మద్దతు ధర ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాలకు అదనంగా రూ.500 బోనస్ ప్రకటించడం తో అర్హత కలిగిన రైతులకు క్వింటాలుకు రూ.2,941 నుంచి రూ.2,961 వరకు లభించే అవకాశం ఉన్నది. దీంతో ప్రభుత్వ కొనుగోళ్లు ప్రారంభమై వేగవంతమైతే తమకు కొంతైనా ఊరట కలుగుతుందని రైతులు భావిస్తున్నారు. కొనుగోలుదారులు లేక రైతులు రోడ్లపైనే వడ్లు ఆరబోసి కాపలా కాస్తున్నారు. ఎప్పుడు కొనుగోలు చేస్తారో? ఎప్పుడు తూకం వేస్తారో? తెలియని దుస్థితి నెలకొన్నది. అకాల వర్షాలు కురిస్తే ఆరబోసిన ధాన్యం తడిసిపోయి నోటికాడి బుక్క నీటిపాలయ్యే ప్రమాదం ఉన్నదని భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెల్లావారుజామున మంచు కురుస్తుండటంతో తేమ సమస్య మరింత పెరుగుతున్నది.
పట్టించుకునేటోళ్లే లేరు
నేను మూడెకరాల్లో వరి సాగు చేసిన. కామారెడ్డి జిల్లా మహమ్మద్‌నగర్ మండలంలోని కోమలంచలో 15 రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పిండ్రు. ఇప్పటి కీ తూకాలు ప్రారంభించలేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మేందుకు రైతులు రెడీగా ఉన్నరు. పట్టించుకునేటోళ్లే లేరు. ప్రభుత్వం ఆలస్యం చేస్తుండటంతో ప్రైవేట్ వ్యాపారులు వచ్చి ధర తగ్గిస్తున్నరు. క్వింటాలుకు కేవలం రూ.2700 నుంచి రూ.2800 వరకే ఇస్తామంటున్నరు.
– తడగారి నర్సింహులు, రైతు, కోమలంచ
పది రోజుల నుంచి పడిగాపులే
నాకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న ది. ఈ సంవత్సరం సన్న వడ్లు సాగు చేసిన. ప్రభు త్వం ధాన్యం కొనుగోలు చేసి మద్ధతు ధరతో పా టు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పడంతో సొసైటీ పెట్టిన కేంద్రానికి దాదాపు 10 రోజుల కిందనే వడ్లు తెచ్చిన. కుప్పలు పోసి రోజూ ఎదురు చూస్తున్న. ప్రైవేట్ వాళ్లకు అమ్ముకుందామంటే ధర భారీగా తగ్గిస్తున్నరు. మొన్నటిదాకా రూ.3,300 వరకు అడిగి ఇప్పుడు రూ.2,800 లోపే ఇస్తామంటున్నరు.
-కుమ్మరి విఠల్, రైతు, కామారెడ్డి జిల్లా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

