రేవంత్ విమర్శలు పిచ్చి ప్రేలాపనలే!
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్‌ను పదేపదే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? రాజకీయ విమర్శలు వ్యక్తిగత ఆరోపణలుగా ఎందుకు మారుతున్నాయి? ఇలాంటి ఆరోపణల ద్వారా కాంగ్రెస్ ఏం సాధించాలని అనుకుంటున్నది? ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సమయంలో వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల ఎవరికి లాభం? కేటీఆర్ పట్ల అనుచితంగా మాట్లాడిన మాజీమంత్రి కొండా సురేఖ విచారం వ్యక్తం చేయకతప్పలేదు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్‌ను పదేపదే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? రాజకీయ విమర్శలు వ్యక్తిగత ఆరోపణలుగా ఎందుకు మారుతున్నాయి? ఇలాంటి ఆరోపణల ద్వారా కాంగ్రెస్ ఏం సాధించాలని అనుకుంటున్నది? ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సమయంలో వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల ఎవరికి లాభం? కేటీఆర్ పట్ల అనుచితంగా మాట్లాడిన మాజీమంత్రి కొండా సురేఖ విచారం వ్యక్తం చేయకతప్పలేదు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడితే ఎలాంటి పరిస్థితి వస్తుందో ఆమె అనుభవం నుంచి కాంగ్రెస్ నేతలు గుణపాఠం నేర్చుకోవడంలేదు.
తెలంగాణకు కావాల్సింది వ్యక్తిగత విమర్శలు కాదు. పాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై చర్చించే రాజకీయ సంస్కృతి. కేటీఆర్‌ను కేవలం కేసీఆర్ కుమారుడిగా మాత్రమే చూడకూడదు. ఆయన రాజకీయ ప్రస్థానం, విద్యార్హతలు, వృత్తిపరమైన అనుభవం, మాట్లాడే నైపుణ్యం, పరిపాలనా బాధ్యతలు ప్రత్యేకంగా గుర్తించదగినవి. రాజకీయ కుటుంబంలో జన్మించడం వల్ల రాజకీయాలపై అవగాహన, ప్రజాజీవితంపై పరిచయం రావచ్చు. కానీ రాజకీయాల్లో విజయం సాధించే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు స్వయంకృషి, వ్యక్తిగత ప్రతిభ, నిబద్ధత, సంస్థాగత నైపుణ్యాలు, ప్రజలతో మమేకమయ్యే సామర్థ్యంతోనే నిరూపించుకోవాలి. కేటీఆర్ స్వరాష్ట్ర ఉద్యమంలో భాగస్వామిగా మారి, తెలంగాణ అంతటా పర్యటించి, ప్రజలతో మమేకమై, రాజకీయ బాధ్యతలు చేపట్టారు. కాలక్రమేణా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఉద్యమంలో, స్వరాష్ట్రంలో ప్రభుత్వంలో ప్రముఖ నాయకుడిగా ఎదిగారు.
అందువల్ల ఆయన రాజకీయ ప్రస్థానాన్ని వ్యక్తిగత కృషి, సామర్థ్యాల ఆధారంగా అంచనా వేయాలి. దేశంలోని ఇతర రెండో తరం రాజకీయ నాయకులతో పోల్చి చూసినప్పుడు కేటీఆర్ రాజకీయ ప్రస్థానంలో కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ 1992లో సమాజ్‌వాదీ పార్టీని స్థాపించిన ఎనిమిదేండ్ల తర్వాత ఆయన కుమారుడు అఖిలేష్ రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటికే ములాయం ఆ రాష్ట్ర సీఎంగా పనిచేశారు. బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ 1997లో ఆర్జేడీని స్థాపించిన పదహారేండ్ల తర్వాత ఆయన కుమారుడు తేజస్వీయాదవ్ రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటికే లాలూ ప్రసాద్‌యాదవ్, రబ్రీదేవి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో 2013లో లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటికే ఆయన తండ్రి చంద్రబాబు పలుమార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఇలా దేశంలో ప్రాంతీయ పార్టీల్లో చాలామంది వారసులు పార్టీ స్థాపించిన తర్వాత చాలా కాలానికి రాజకీయాల్లోకి వచ్చారు. కేటీఆర్ ప్రత్యేకత ఏమిటంటే, తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఆయన టీఆర్ఎస్లో చేరారు. పార్టీ నిర్మాణం, ఉద్యమంలో భాగస్వామిగా పనిచేశారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి కేటీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని కేవలం కుటుంబ వారసత్వ కోణంలో చూడకూడదు. కేటీఆర్ ఉన్నత విద్యను అభ్యసించిన రాజకీయ నాయకుడు. ఆయన విద్యా నేపథ్యం, వృత్తిపరమైన అనుభవం దేశ రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. వృత్తిపరమైన అనుభవం ద్వారా అంతర్జాతీయ పని వాతావరణం, కార్పొరేట్ రంగంపై పట్టు సాధించారు. ఇంగ్లిష్‌లో ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం, క్లిష్టమైన విషయాలను సులభంగా వివరించడం, వెంటనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, వివిధ వర్గాల ప్రజలతో అనుసంధానం కావడం మరో ప్రత్యేకమైన నైపుణ్యం. కేటీఆర్ మంత్రిగా ఉన్న కాలంలో హైదరాబాద్ సమాచార సాంకేతిక రంగం, పెట్టుబడులు, ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నది. తెలంగాణను పెట్టుబడులకు అనుకూలమైన గమ్యస్థానంగా ప్రోత్సహించడంలో కేటీఆర్ ప్రముఖ పాత్ర పోషించారు.
టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, టీఎస్-ఐపాస్ వంటి కార్యక్రమాలు, స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, మహిళా పారిశ్రామికవేత్తలు, తయారీ రంగం, వేగవంతమైన పారిశ్రామిక అనుమతులపై బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన దృష్టికి నిదర్శనంగా నిలిచాయి. హైదరాబాద్‌లోని పశ్చిమ ప్రాంతానికే పరిమితం కాకుండా వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి నగరాల్లో కూడా ఐటీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటీఆర్ చేసిన ప్రయత్నాలు రాష్ట్రమంతటా అవకాశాలను విస్తరించాలనే ఆలోచనను ప్రతిబింబించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో గణనీయమైన వృద్ధి నమోదైంది. నేటి యువత రాజకీయ నాయకత్వం నుంచి మరింత ఆశిస్తున్నది. వారికి ఉద్యోగ అవకాశాలు, నాణ్యమైన విద్య, పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశాలు, సాంకేతికత ఆధారిత అభివృద్ధి, తమ ఆశయాలను నెరవేర్చుకునే వాతావరణం కావాలి.
మారుతున్న ఆర్థిక, సాంకేతిక ప్రపంచాన్ని అర్థం చేసుకుని యువత ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే నాయకత్వం తెలంగాణకు అవసరం. ఈ చర్చలో కేటీఆర్ అనుభవం ఆయనను ఒక ముఖ్యమైన నాయకుడిగా నిలబెడుతుంది.
ఉద్యమంలో ఆయన భాగస్వామ్యం, మంత్రిగా నిర్వహించిన బాధ్యతలు, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ను నడిపిస్తున్న తీరు వంటి అనేక అంశాలు ఉన్నాయి. కేటీఆర్ పనితీరు, సాధించిన ఫలితాల ఆధారంగా మాట్లాడలేని సీఎం రేవంత్‌రెడ్డి, వ్యక్తిగతంగా నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికీ పిచ్చి ప్రేలాపనలే అవుతాయి.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు)
జీవీ రామకృష్ణారావు
98667 67777
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

