ఓయూకు వెయ్యి కోట్లు ఏమయ్యాయి రేవంత్
ఓయూకు ఇస్తానన్న వెయ్యి కోట్లు ఏమయ్యాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓయూ నాన్ టీచింగ్ స్టాఫ్ జేఏసీ ఆధ్వర్యంలో పరిపాలనా భవనం ఎదుట మహాధర్నా నిర్వహించారు
-
నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిందే
-
బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 10: రేవంత్.. ఓయూకు ఇస్తానన్న వెయ్యి కోట్లు ఏమయ్యాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓయూ నాన్ టీచింగ్ స్టాఫ్ జేఏసీ ఆధ్వర్యంలో పరిపాలనా భవనం ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎంపీలు ఈటల రాజేందర్, ఆర్ కృష్ణయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ (కాంట్రాక్ట్ – తెలంగాణ స్టేట్) అధ్యక్షుడు డాక్టర్ పరశురాం, కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ధర్మతేజ తదితరులు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవేనన్నారు. వాటిని తక్షణమే పరిష్కరించకుండా జాప్యం చేస్తున్న అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ఓయూకు ఇస్తానన్న వెయ్యి కోట్లు ఏమయ్యాయంటూ.. తక్షణమే ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. వర్సిటీ ఉద్యోగులకు తక్షణమే హెల్త్‌కార్డులు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. రూ.15 వేల నెల జీతం తీసుకుంటూ.. ఉద్యోగులు ఎలా జీవనం సాగిస్తారని ప్రశ్నించారు. వర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగుల పరిస్థితి భవన నిర్మాణ కార్మికులకంటే దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తూ చనిపోతే రూ. 10 లక్షలు, గాయపడితే రూ. 5 లక్షలు ఇస్తారని, కానీ వర్సిటీ ఉద్యోగులకు కనీసం లక్ష కూడా ఇవ్వడం లేదని వాపోయారు.
గత ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ శాఖల్లో వేలమందిని పర్మనెంట్ చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా వర్సిటీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ 2001 నుంచి 2004 మధ్య నియమితులైన అర్హులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2004 సెప్టెంబర్ 1వ తేదీ తరువాత నియమితులైన ఉద్యోగులకు సీపీఎస్ అమలు చేయాలని కోరారు. అన్ని విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. టైంస్కేల్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల వైద్య ఖర్చుల రీయింబర్స్మెంట్ పరిమితిని రూ.పది వేల నుంచి రూ.30 వేలకు పెంచాలన్నారు. గత కొన్ని నెలలుగా తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా, వాటిని పరిష్కరించకపోవడంతోనే దశలవారీగా నిరసనలకు దిగినట్లు చెప్పారు. సమస్యలను పరిష్కరించడంలో జరుగుతున్న జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పదిహేను రోజులుగా తాము నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 17వ తేదీ నుంచి ప్రభుత్వం మెడలు వంచే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

