సీఎం సభ కోసం చెరువు ఖాళీ!
ఓ వైపు కరువుతో రైతులు పంటలను కాపాడుకొనేందుకు అల్లాడుతుంటే.. సీఎం ఇలాకా కొడంగల్‌లో రైతుమేళా, హెలిప్యాడ్, ఇండస్ట్రియల్ పార్క్ పనుల కోసం ఏకంగా చెరువునే ఖాళీ చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్న సమయంలో ఆ చెరువు నీళ్లనే నమ్ముకున్న రైతులకు సాగునీళ్లివ్వకుండా అడ్డుకొని మరీ ఆంక్షలు విధించారు.
- మోటర్ల్ల ద్వారా ట్యాంకర్ల నీటి తరలింపు.. రైతుమేళా, హెలిప్యాడ్, ఇండస్ట్రియల్ పార్క్ పనుల కోసం దౌర్జన్యంగా సరఫరా
- ఓ వైపు ఎండుతున్న పంటలు
- సాగునీటి విడుదలను నిలిపివేసి ఇష్టారాజ్యం
- టీజీఐఐసీ తీరుతో ఆందోళన
- అడ్డుకోకుండా బీఆర్ఎస్ పార్టీ నేతలపైనే కేసులు
- కొడంగల్‌లో కాంగ్రెస్ తెస్తున్న కరువుకు నిదర్శనం
మహబూబ్‌నగర్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓ వైపు కరువుతో రైతులు పంటలను కాపాడుకొనేందుకు అల్లాడుతుంటే.. సీఎం ఇలాకా కొడంగల్‌లో రైతుమేళా, హెలిప్యాడ్, ఇండస్ట్రియల్ పార్క్ పనుల కోసం ఏకంగా చెరువునే ఖాళీ చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్న సమయంలో ఆ చెరువు నీళ్లనే నమ్ముకున్న రైతులకు సాగునీళ్లివ్వకుండా అడ్డుకొని మరీ ఆంక్షలు విధించారు. భారీ మోటర్లతో దౌర్జన్యంగా ట్యాంకర్ల ద్వారా తరలిస్తూ అడ్డుకుంటారనే అనుమానంతో బీఆర్ఎస్ నేతలపై దాడులకు దిగి, కేసులూ పెడుతున్నారు. కొడంగల్ నియోజకవర్గం సర్జఖాన్‌పేట చెరువు నీటిని ఖాళీ చేయడం చూస్తుంటే కాంగ్రెస్ తెచ్చిన కరువుకు నిదర్శనంగా మారింది.
సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 7, 8, 9 తేదీల్లో కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తుండటంతో పాటు హకీంపేట ఇండస్ట్రియల్ పార్కులో రెండు రోజులపాటు రైతుమేళాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రైతుమేళా కోసం భూమి చదును, హెలిప్యాడ్ పనుల కోసం నారాయణపేట జిల్లా కోస్గి మండలం సర్జ్ఖాన్పేట దండం చెరువు నీటిని ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నారు. అంతేగాగాక ఎడ్యుకేషన్ హబ్‌లో నిర్మిస్తున్న భారీ భవంతులకు కూడా ఈ నీటిని రాత్రిళ్లు తరలించి నిల్వ చేసి క్యూరింగ్ చేస్తున్నారు. చెరువు నీటినే నమ్ముకున్న వందలాది మంది రైతులు సాగునీరందక పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. ఈ చెరువు విస్తీర్ణం 675 ఎకరాలు కాగా, చెరువు కింద ప్రత్యక్షంగా 1,500 ఎకరాలు, పరోక్షంగా 5 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నదని గ్రామస్తులు చెప్తున్నారు. చెరువులో నీరు తగ్గడంతో ఆందోళన చెందుతున్నారు.

ఇండస్ట్రియల్ పార్కులో నీటి కొరత..
మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్‌లో ప్రస్తుతం పలు కళాశాలలతోపాటు మెడికల్, నర్సింగ్ కాలేజీ పనులు నడుస్తున్నాయి. కొంతకాలంగా రైతుల నుంచి సేకరించిన భూముల్లో ఉన్న బోర్ల ద్వారా నీటిని వాడుకుంటున్నారు. ఇటీవల వర్షాభావ పరిస్థితులు రావడంతో వీటిలో నీటిమట్టం తగ్గింది. దీంతో పక్కనే ఉన్న సర్జఖాన్‌పేట చెరువుపై కన్ను పడింది. రాత్రికిరాత్రి టీజీఐఐసీ రంగంలోకి దిగి చెరువు నీటిని పార్కులోని భవనాల కోసం వాడాలని స్థానిక అధికారులకు అప్పటికప్పుడే ఆదేశాలు వెళ్లాయి.
అంతేకాకుండా ఈ నీటిని ఎట్టి పరిస్థితుల్లో రైతుకు విడుదల చేయవద్దని చిన్న నీటి పారుదల శాఖ అధికారులకు కూడా హుకుం జారీ చేశారు. దీంతో కాంట్రాక్టర్ ఏకంగా చెరువులో భారీ మోటర్లు ఏర్పాటుచేసి పైపులు వేశారు. పగలైతే ఇబ్బంది అని భావించిన అధికారులు రాత్రిపూట ఈ చెరువు మోటర్‌కు కోతలు లేని కరెంటును అందించి చెరువు నీటిని మొత్తం తోడేస్తున్నారు. ముఖ్యమంత్రి అయి ఉండి నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాల్సింది పోయి ఆ చెరువుపై ఆధారపడ్డ వందలాది కు టుంబాలను ఇబ్బందులు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికైనా ఉన్న నీటిని నిలువ చేసి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రత్యామ్నాయంగా నీటిని వాడాలని గ్రామస్తులు డిమాండు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

