బాలారిష్టాలు దాటనిభూసేకరణ
ఓల్డ్ సిటీ మెట్రోకు భూసేకరణ బాలారిష్టాలను దాటలేకపోతున్నది. ప్రాజెక్టును ప్రకటించి రెండేండ్లు గడిచినా, భూసేకరణ పనులు కొలిక్కి రాలేదు. దీంతో ప్రాజెక్టుకు అవసరమైన ఆస్తుల సేకరణ క్లిష్టంగా మారింది.
-
కొలిక్కిరాని ఓల్డ్ సిటీ మెట్రో
సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఓల్డ్ సిటీ మెట్రోకు భూసేకరణ బాలారిష్టాలను దాటలేకపోతున్నది. ప్రాజెక్టును ప్రకటించి రెండేండ్లు గడిచినా, భూసేకరణ పనులు కొలిక్కి రాలేదు. దీంతో ప్రాజెక్టుకు అవసరమైన ఆస్తుల సేకరణ క్లిష్టంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెబుతున్నా… భూసేకరణ ప్రక్రియ మాత్రం పూర్తి కాలేదు. హైదరాబాద్ మెట్రోకు కొత్త ఎండీ వచ్చినా… కార్యాచరణకు వచ్చేసరికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఇక మతపరమైన నిర్మాణాలు, ఆస్తుల సేకరణలో భూతగాదాలు కోర్టుల పరిధిలోనే ఉన్నాయి. ప్రభుత్వం కూడా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకపోవడంతో ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టు మరింత జాప్యం కానున్నది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఓల్డ్ సిటీ మెట్రోకు భూసేకరణ జాప్యంతో నిర్మాణ పనులకు మరో మూడు నెలలు సమయం మిగతా
పట్టేలా ఉంది. ఓల్డ్ సిటీ అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్టును నిర్మిస్తామని కాంగ్రెస్ సర్కార్ చెబుతున్నా ఆచరణలో అడుగుపడలేదు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పనులు ఇప్పటికీ మొదలు కాలేదు. మొత్తం 800 పైగా ఆస్తులను గుర్తించగా.. ఇందులో 250కిపైగా ఆస్తులను సేకరించాల్సి ఉంది. మిగిలి ఉన్న ఆస్తుల విషయంలోనే భూ తగదాలు చుట్టుకుంటున్నాయి. వేగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.
కోర్టులో భూ వివాదాలు
ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టులో భూ వివాదాలు ప్రధాన సమస్యగా మారాయి. వందలాది మంది తమ ఆస్తులను కాపాడుకునేందుకు భూ యజమానులు కోర్టులను ఆశ్రయించారు. చారిత్రక నిర్మాణాలు, మతపరమైన కట్టడాలు ఉండటంతో వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పినా… క్షేత్రస్థాయిలో భూసేకరణకు అడ్డంకులు వస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ప్రాజెక్టుకు అవసరమైన ఆస్తుల సేకరణ పూర్తి చేసి, కూల్చివేతలు మొదలుపెట్టాల్సి ఉంది. కానీ గడిచిన రెండేండ్లుగా భూసేకరణ లక్ష్యాన్ని చేరుకోలేక, ప్రాజెక్టు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. ముఖ్యంగా కోర్టు పరిధిలో ఉన్న భూ వివాదాలు ముగిసేంత వరకు ప్రాజెక్టు పనులు కొలిక్కి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

