సర్కార్ నిర్లక్ష్యంతోనే కరువు
కాంగ్రెస్ పాలకుల చేతగాని తనంతోనే నేడు దేవరకద్ర నియోజకవర్గంలో పంటలు ఎండిపోయాయని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ముచ్చింతల, దాసరిపల్లి శివారులో ఎండిన పంటలను రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల ఎదుట అన్నదాతలు తమ గోడువెళ్లబోసుకున్నారు.
- పంటలు ఎండినా పట్టింపు లేదు
- ఏపీలో 800 కి.మీ. దూరంలోని కుప్పానికి సాగునీళ్లు
- దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల
- ఎండిన పంటపొలాల పరిశీలన
మూసాపేట/కౌకుంట్ల, నవంబర్ 5 : కాంగ్రెస్ పాలకుల చేతగాని తనంతోనే నేడు దేవరకద్ర నియోజకవర్గంలో పంటలు ఎండిపోయాయని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ముచ్చింతల, దాసరిపల్లి శివారులో ఎండిన పంటలను రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల ఎదుట అన్నదాతలు తమ గోడువెళ్లబోసుకున్నారు. ‘కేసీఆర్ సార్ అధికారంలో ఉన్నప్పుడు మాకు గిన్నీ కష్టాలు లేకుండే.. మేము చేసుకున్న ఖర్మ ఇది. మంచి చేసిన కేసీఆర్ సార్‌ను ఓడించినందుకు మాకు తగిన శాస్తి జరిగింది’ అని ఆవేదన చెందారు.
ఈ సందర్భంగా ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కృష్ణా జలాలను 800 కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి తీసుకెళ్లి పంటలకు సాగునీరు అందిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా మీదుగా కృష్ణానది పారుతున్నా కనీసం 30 కిలోమీటర్ల దూరానికి కూడా నీటిని తీసుకెళ్లడం ఇక్కడి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చేతకాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యంతోనే పంటలు ఎండాయని, రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు తెలిపారు. పంటలను కాపాడుకోవాలని ఒక్కో రైతు 4, 5 బోర్లు వేసి లక్షల వెచ్చించి అప్పుల పాలైనట్టు ఆవేదన వ్యక్తంచేశారు. జూరాలకు వరద వచ్చిన వెంటనే ఎత్తిపోతలు ప్రారంభించి ఉంటే నేడు రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

