గాంధీ ఆస్పత్రి సమస్యలపై పట్టింపేది?
లక్షలాది మందికి వైద్య సేవలు అందిస్తున్న గాంధీ దవాఖానలో నెలకొన్న సమస్య పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఆయన సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో మురుగునీటి సమస్యలపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
-
తలసాని శ్రీనివాస్ యాదవ్
బన్సీలాల్‌పేట్, నవంబర్ 5 : లక్షలాది మందికి వైద్య సేవలు అందిస్తున్న గాంధీ దవాఖానలో నెలకొన్న సమస్య పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఆయన సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో మురుగునీటి సమస్యలపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చొరవతో గాంధీ దవాఖానలో మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి రూ.3.45 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు గుర్తు చేశారు
. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ నిధులను విడుదల చేయని కారణంగా ఎస్టీపీ పనులు ఆగిపోయాయని తెలిపారు. దాని వల్ల గాంధీ దవాఖాన నుంచి వెలువడుతున్న మురుగునీరు, వ్యర్థాలు వెనుక వైపు ఉన్న పద్మారావునగర్‌లోని ఓపెన్ నాలాలో మిగతాకలుస్తున్నాయని, తీవ్రమైన దుర్గంధంతో వెంకటాపురం, అభినవనగర్ కాలనీవాసులు, అపార్ట్మెంట్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్టీపీ నిర్మాణంలో ఆలస్యం అవుతున్నందున, తాత్కాలిక ఉపశమన చర్యలు ఏం తీసుకోవాలో అధ్యాయనం చేసేందుకు వచ్చే బుధవారం లమండలి,జీహెచ్ఎంసీ, టీఎస్ఎంఐడీసీ శాఖల అధికారులు పద్మారావునగర్‌లో పర్యటించి, తనకు నివేదిక అందజేయాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గాంధీ దవాఖానను కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం దవాఖానను పట్టించుకోకపోవడంతో అనేక మస్యలు నెలకొన్నాయన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కే. నీల్ కుమార్, జలమండలి సీజీఎం వినోద్ కుమార్, జీఎం శ్రీధర్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఎస్ఈ ఆశాలత, టీఎస్ఎంఐడీసీ డీఈఈ జగదీశ్, మాజీ కార్పొరేటర్ హేమలత, బీఆర్ఎస్ ఇన్చార్జి పవన్‌కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు వెంకటేశన్ రాజు, ఏసూరి మహేశ్, శ్రీకాంత్‌రెడ్డి, లక్ష్మీపతి పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

