మహబూబాబాద్ : మహబూబాబాద్’(Mahabubabad) జిల్లా తొర్రూరు మండల పరిధిలోని పలువురు వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)పై విధించిన సస్పెన్షన్‌ను(AEOs suspension) ఎత్తివేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తొర్రూరు( Thorrur) వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు సోమవారం ధర్నా(Farmers dharna) నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జీలుగ విత్తనాల అవినీతి బాగోతం నుంచి తప్పించుకునేందుకు ఏవో సోమకుమార్, ఏడీఏ కలిసి ఏఈవోలు జమున, దీపిక, అరవింద్‌ను సస్పెండ్ చేయడంపై మండి పడ్డారు.
జీలుగ విత్తనాల దందాలో ఎటువంటి ప్రమేయం లేని ఏఈవోలను సస్పెండ్ చేయడం సిగ్గుచేటన్నారు. ఏవో కుమార్ జీలుగ విత్తనాలను పక రాష్ట్రాలకు అమ్ముకున్నారని, తనను తాను రక్షించుకునేందుకు ఏఈవోలను ఈ అవినీతిలోకి లాగాడన్నారు. విచారణ అధికారిగా వచ్చిన ఏడీఏ కూడా అవినీతిలో భాగమయ్యాడని, రైతులను విచారించలేదని, విక్రయ కేంద్రాల యజమానులు ఏఈవోల పాత్ర లేదని చెప్పిన నివేదికను సైతం తారుమారు చేశాడన్నారు.
తక్షణమే విజిలెన్స్ అధికారులచే నిష్పక్షపాత విచారణ జరిపించాలని, లేకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుందని రైతులు హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు మాలోత్ సురేశ్‌బాబు, ఐలయ్య, భూపతి, రాజేందర్, సైదానాయక్, సాయిరాం, రవి, పాప, నరసింహ, దేవేందర్, రాజబాబు, బీరియానాయక్, లాల్‌సింగ్, కిస్తు, పద్మ, కాళి, స్వాతి, పూలమ్మ, కమల, పిచ్చమ్మ, బుజమ్మ, విమల తదితరులు పాల్గొన్నారు.