పెన్‌పహాడ్, ఫిబ్రవరి 13 : కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పంట నీళ్లులేక కండ్ల ముందే ఎండిపోతుండటంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలు రాక, భూగర్భ జలాలు లేక వరి పైర్లు దెబ్బతిన్నాయి. జిల్లాకు చెందిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో పెన్‌పహాడ్ మండలం చిన్నసీతారాంతండాకు చెందిన రైతులు గురువారం ఆందోళనకు దిగారు.
ఎండిన వరి పైర్ల దగ్గర మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఎస్సారెస్సీ కాల్వల ద్వారా గోదావరి జలాలు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. ఇప్పటికైనా సాగు నీరు అందించి రైతులను ఆదుకోవాలని కోరారు.