జూలపల్లి, ఫిబ్రవరి 6 : యూరియా కోసం రైతులు గంటల తరబడి లైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. సరిపడా యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరిపతి సంఘం పరిధిలో పెద్దాపూర్, కుమ్మరికుంట, కోనరావుపేట, జూలపల్లి గ్రామాలున్నాయి. యూరియా వచ్చిందని తెలిసి గురువారం విండో కార్యాలయం వద్ద ‘క్యూ’ కట్టారు. ఎరువుల కోసం గంటన్నరసేపు ఎదురు చూశారు. ఒక్కో రైతుకు 4 బస్తా లు పంపిణీ చేయగా, 10 ఎకరాల పైనున్న పంటలకు అరకొర యారియా ఎలా సరిపోతుందని రైతులు ప్రశ్నించారు. కొంతమంది రైతులకు అందకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు.
పంటలకు సరిపడా యూరియా అందక ఇబ్బందులు పడుతున్నం. మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి. బస్తాల కోసం లైన్లో నిలబడి ఎదురు చూస్తు న్నం. రైతులకు అందుబాటులో యూరియా నిల్వలు ఉండడం లేదు. యూ రియా కోసం వెళ్లి రావడంతో వ్యవసాయ పనులు కూడా చేసుకోలేకపోతున్నం. యూరియా నిల్వలు ఉండేలా ఏర్పాటు చేయాలి.