హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఇదేం రాజ్యమంటూ అన్నదాతల మండిపాటుయూరియా దొరక్క అన్నదాతలకు వెతలు తప్పడం లేదు. జిల్లాల్లో రోజురోజుకూ కొరత పెరిగిపోతుండటంతో ఆందోళనలు తీవ్రమవుతు న్నాయి. యూరియా ఇప్పించండి మహాప్రభో.. అంటూ రైతన్నలో రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ఆయా చోట్ల అధికార పార్టీ నేతలు, అధికారులను నిలదీస్తున్నారు. ఇదేమి రాజ్యమంటూ మండిపడుతున్నారు. 20 రోజులైనా సరిపడా యూరియా తెప్పించడంలో విఫలమైం దంటూ నిలదీస్తున్నారు. తమ వద్దకు వచ్చిన ప్రతిపక్ష పార్టీల నేతలకు గోడు చెప్పుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. నమ్మి ఓటేస్తే నట్టేట ముంచారని, బస్తా యూరియా కోసం ఇలా గంటల తరబడి క్యూలు కట్టే రోజులు మళ్లీ వస్తాయని అనుకోలేదని వాపోతున్నారు.
మంత్రి ఇలాకైనా తిప్పలవే..
సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నియోజకవర్గం హుజూర్‌నగర్‌లోని పాలకవీడు సొసైటీ కార్యాలయం ఎదుట బారులు తీరిన రైతులు
ఒక్కోబస్తాకు ఐదుగురు
మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని సొసైటీకి శనివారం 200 బస్తాల యూరియా రావడంతో కేంద్రం వద్ద వెయ్యిమందికి పైగా రైతుల క్యూ
నాయకా..మీరే మా ధైర్యం
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఉట్టితండాలో పత్తి పీకేసిన రైతు భూక్యా బాలు కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
ఇల్లెందులోనూఇబ్బందే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులోని సొసైటీ కార్యాలయం వద్దకు యూరియా కోసం తరలివచ్చిన వివిధ ప్రాంతాల రైతులు
యూరియా యాతన..తప్పని నిరీక్షణ
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని నెల్కివెంకటాపూర్ పీఏసీఎస్ కార్యాలయం వద్ద బారులు తీరిన రైతులు
బీఆర్ఎస్సే భరోసా
పెద్దపల్లి జిల్లా మంథనిలోని పాత పెట్రోల్ పంపు చౌరస్తాలో రైతులు, నాయకులతో కలిసి ధర్నా చేస్తున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
రహదారిపై రైతన్న
సిద్దిపేట జిల్లాకేంద్రంలో యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్-సిద్దిపేట రహదారిపై ధర్నా చేస్తున్న రైతులు. యూరియా కోసం వారం రోజులుగా తిరుగుతున్నా బస్తా కూడా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాకు సిద్దిపేట పట్టణ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి నాయకులు సంఘీభావం ప్రకటించారు.
‘చెప్పు’తున్నాయి.. మా కష్టాలు
నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు సహకార సంఘం వద్ద వరుసగా చెప్పులు ఉంచిన రైతులు
ఇంకా ఎదురుచూపులే..
ములుగు జిల్లా జేడీ మల్లంపల్లిలో సొసైటీ కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో అధికారులు, సిబ్బంది రాక కోసం ఎదురు చూస్తున్న రైతులు
యూరియా ఏది సారు..?
నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో యూరియా కోసం శనివారం ఏవో రమేశ్‌ను నిలదీస్తున్న రైతులు, బీఆర్ఎస్ నాయకులు
కన్నీటి గోస పట్టించుకునేదెవరు..?
కామారెడ్డి జిల్లా రామారెడ్డి సొసైటీ వద్ద శనివారం రాత్రి యూరియా దొరకలేదని వెక్కివెక్కి ఎడుస్తున్న రైతు రాములు
తప్పలేదు.. తప్పులేదు
సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలోని రైతు వేదికలో ఏవో తస్లీమా, ఏఈవోలు సబిహ, చంద్రశేఖర్, శేఖర్‌ను బంధించిన రైతులు
మళ్లొచ్చిన కష్టాల రాజ్యం
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో యూరియా కోసం ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద క్యూ కట్టిన రైతులు