ఘట్కేసర్, సెప్టెంబర్ 22: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఉమ్మడి మండలానికి చెందిన 1,189 మంది రైతులకు ప్రభు త్వం ప్రకటించిన రుణమాఫీ వర్తించకపోవటంతో 13రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అయినా, ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతు రుణమాఫీ సాధన సమితి కన్వీనర్ కంట్లం గౌరీశంకర్, మాజీ ఎంపీపీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏనుగు సుదర్శన్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఎఫ్ఎస్సీఎస్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, నాయకులు మహిపాల్‌రెడ్డి, రవికాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రైతులు సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు రైతులను బలవంతంగా అరెస్టుచేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.