మహబూబ్‌నగర్ : భూ రిజిస్ట్రేషన్(Land registration) నిలిపివేయాలని ఓ రైతు తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహ త్యాయత్నానికి(Suicide attempt) పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా మహ్మదా బాద్‌కు చెందిన అంజిలమ్మ పేరుపై ఉన్న పట్టా భూమిని ఇతరుల పేరుపై రిజిస్ట్రేషన్ చేసేందుకు చూస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఆమె అల్లుడు నర్సింహారెడ్డి బుధవారం ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి అతడిని పీఎస్‌కు తరలించారు.
ఈ విషయమై తాసీల్దార్ తిరుపతయ్యను వివరణ కోరగా.. వెంకట్‌రెడ్డిపల్లికి చెందిన నాగిరెడ్డి, అంజిలమ్మకు ఒక్కతే కూతురు రాఘవేంద్రమ్మ ఉండగా.. నర్సింహారెడ్డిని ఇళ్లరికం పెండ్లి చేసుకున్నాడని తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో రాఘవేంద్రమ్మ మృతి చెందగా.. తర్వాత అంజిలమ్మ పేరుపై ఉన్న భూమిని ఇతరుల పేరుపైకి రిజిస్ట్రేషన్ చేసే విషయం తెలుసుకొన్న నర్సింహారెడ్డి అడ్డుపడినట్లు వివరించారు. అత్త పేరుపై ఉన్న భూమికి తానే వారసుడిని.. ఇతరుల పేరుపైకి రిజిస్ట్రేషన్ చేయొద్దని ఆత్మహత్యాయత్నం చేసినట్లు వివరించారు.