మల్యాల (కొడిమ్యాల), జనవరి 9: రైతు బీమా పథకం నిరుపేద రైతులకు వరంగా మారింది. రాష్ట్రంలోనే తొలిసారిగా గుంట లోపు భూమి ఉన్న రైతు కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం మంజూరైంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నర్సింహులపల్లెకు చెందిన గంట లచ్చయ్య గత నెల 23న రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయనకు మండలంలోని పూడూర్ శివారులో గుంట కంటే తక్కువ భూమి ఉన్నది. దీనికి పసల్కు రూ.93 రైతుబంధు జమ అవుతున్నది. లచ్చవ్వ రైతుబీమాకు దరఖాస్తు చేసుకోగా, రెండు రోజుల క్రితం ఖాతాలో 5 లక్షలు జమయ్యాయి. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదివారం లచ్చవ్వకు ప్రొసీడింగ్ పత్రాన్ని అందజేశారు.