కొడిమ్యాల, ఫిబ్రవరి 26: కాంగ్రెస్ నేత కుటుంబానికి రైతుబీమా పథకం భరోసానిచ్చింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేట ఎంపీటీసీ డబ్బు జగన్మోహన్రెడ్డి భార్య లక్ష్మి 22 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది. ఆమె పేరిట వ్యవసాయ భూమి ఉండటంతో రైతుబీమా కింద రూ. 5 లక్షలు మంజూరయ్యాయి. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శనివారం మంజూరుపత్రాన్ని జగన్మోహన్రెడ్డి ఇంటికి వెళ్లి అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం.. పార్టీలు, వర్గాలకతీతంగా పథకాలను వర్తింపజేస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.