హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (రైతు డిస్కమ్)కు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. శనివారం విద్యుత్తు పంపిణీ లైసెన్సును జారీచేసింది. రాష్ట్రంలోని రైతులకు ఉచిత విద్యుత్తు కొనసాగుతుందని, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఉండవని ఈఆర్సీ స్పష్టత ఇచ్చింది. కొత్త డిస్కమ్ 4 నెలల్లోగా కార్యకలాపాలు ప్రారంభించాలని ఈఆర్సీ పేర్కొన్నది. విద్యుత్తు టారిఫ్ విషయంలో ఎలాంటి మార్పుల్లేవని, 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆమోదించిన టారిఫ్, సబ్సిడీలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్ ప్రతిపాదనలను ఈ ఏడాది నవంబర్ 30లోగా సమర్పించాలని రైతు డిస్కమ్తోపాటు ఉత్తర, దక్షిణ డిస్కమ్ (ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్)లకు సూచించాలన్నది. రైతు డిస్కమ్‌పై ఈఆర్సీ పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేసింది.
ఈఆర్సీ ఉత్తర్వులు