ఉప్పునుంతల, జూన్ 5 : విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లక్ష్మాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకున్నది. లక్ష్మాపూర్‌కు చెందిన రైతు రాపాణి ఆంజనేయులు (45) తన పొలంలో పత్తి విత్తనాలు వేస్తుండగా పైన వేలాడుతున్న విద్యుత్తు తీగలు ప్రమాదవశాత్తు తగలడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.