వేములవాడ రూరల్, డిసెంబర్ 22: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనందునే రైతు భరోసా ఇవ్వలేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే జనవరిలోనే రైతుబంధు అందజేస్తామని చెప్పారు. రూ.2 లక్షలలోపు రైతు రుణాలన్నీ చేశామని, ఎక్కడైనా మాఫీ కాని రైతులుంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు సేవచేయాలని మార్కెట్ కమిటీ పాలకవర్గానికి సూచించారు. వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రొండి రాజు, వైస్ చైర్మన్‌గా కనికరపు రాకేశ్, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు.