రామాయంపేట, నవంబర్ 15: దిగుబడులు లేక.. చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతులు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రైతు ముద్రగల్ల మల్లయ్య (48) తన చేపల చెరువులో చేపలు పెంచాడు. చేపలు సరిగ్గా ఎదగక లాభాలు రాలేదు.
తనకున్న ఎకరం భూమిలో పంట దెబ్బతిన్నది. దాదాపు రూ.3 లక్షల వరకు అప్పు అయింది. దీంతో మనస్తాపానికి గురైన మల్లయ్య శుక్రవారం గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రామాయంపేట ఎస్సై బాలరాజు తెలిపారు.