తాళ్లపెంటలో రైతు ఆత్మహత్య.. దళారులకు పంట అమ్మేవిషయంలో దంపతుల మధ్య గొడవ
ధాన్యం ప్రైవేట్‌గా విక్రయించిన విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ రైతు గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తాళ్లపెంటలో చోటుచేసుకున్నది.
- మనస్తాపంతో భర్త బలవన్మరణం
పెనుబల్లి, మే 13 : ధాన్యం ప్రైవేట్‌గా విక్రయించిన విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ రైతు గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తాళ్లపెంటలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన రైతు దవళం వెంకటేశ్ (42) నాలుగెకరాల భూమిలో వరి సాగు చేశాడు. చేతికొచ్చిన పంటను ఆరబెట్టాడు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొంటారో లేదోననే ఆందోళనతో బయట దళారులకు విక్రయించాడు. దళారులకు పంట ఎందుకు విక్రయించావని వెంకటేశ్ భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది.
తీవ్ర మనస్తాపం చెందిన వెంకటేశ్ ఈ నెల 11న ఇంట్లో గడ్డిమందు తాగి స్పృహ కోల్పోయి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు కల్లూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఖమ్మం దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ వెంకటేశ్ మంగళవారం రాత్రి మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వీఎం బంజర ఎస్సై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

