హనుమకొండ జిల్లా మైలారంలో విషాదంశాయంపేట, సెప్టెంబర్ 27: హనుమకొండ జిల్లా మైలారంలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పరమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి (51)కి రూ.5 లక్షల వరకు అప్పులయ్యాయి. వాటిని ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో ఈనెల 24న తిరుపతి నాగయ్యకుంట వద్ద గడ్డిమందు తాగి పడిపోయినట్టు చెప్పాడు.
యూరియా అడిగినందుకు రైతు బైండోవర్
చెన్నూర్ రూరల్, సెప్టెంబర్ 27: యూరియా దొరక్కరైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. మండల నాయకులు ఏం చేస్తున్నట్టు?’ అంటూ సోషల్ మీడియాలో వీడియో పెట్టిన ఓ రైతును మంచిర్యాల జిల్లా చెన్నూర్ పోలీసులు శనివారం తహసీల్దార్ మల్లికార్జున్ ముందు బైండోవర్ చేశారు. ఆస్నాద్ గ్రామానికి చెందిన మల్లయ్య ఆవేదన వ్యక్తంచేస్తూ వాట్సప్ గ్రూపుల్లో పోస్టు పెట్టగా వైరల్ అయ్యింది. దీంతో చెన్నూర్ పోలీసులు మల్లయ్యను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ఆపై తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు. మల్లయ్యకు పలువురు బీఆర్ఎస్ నేతలు సంఘీభావం తెలిపారు.